Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మెజార్టీ సీఎంలు భూసేకరణ బిల్లుకు సవరణలు అవసరమని అభిప్రాయపడ్డారు: అరుణ్ జైట్లీ

ప్రధాని అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియాతో మాట్లాడుతూ, మెజార్టీ ముఖ్యమంత్రులు భూసేకరణ బిల్లుకు సవరణలు అవసరమని అభిప్రాయపడ్డారని తెలిపారు. ప్రస్తుతం ఉన్న 2013 భూసేకరణ చట్టం వల్ల ప్రాజెక్టుల అనుమతుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని ముఖ్యమంత్రులు ఫిర్యాదు చేశారని చెప్పారు. రానున్న పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లుకు అవసరమైన సవరణలు చేయడానికి యత్నిస్తామని తెలిపారు.

More Telugu News